Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు అనే రొమాంటిక్ మెలోడిని మేకర్స్ విడుదల చేశారు. కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు. కసిరేస్తూ ఉన్న బావున్నారు. అంటూ భార్య భర్తల మధ్య ఉండే రిలేషన్‌పై ఈ పాట ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ కలిసి పాడరు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.