Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే నేడు బక్రీద్ పండుగ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Get ready for a melodious first single from #LuckyBaskhar 🏦🎶
Song Promo out Today ❤️
A @gvprakash Musical 🎹🎼
Full song out on 19th June. 🎶#VenkyAtluri @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/DxM75RXXy9
— Dulquer Salmaan (@dulQuer) June 17, 2024