Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ శ్రీమతిగారు ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్. శ్రీమణి రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ పాడారు.
ఫ్యామిలీ థీమ్‌తో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని ప్రోమో చెబుతోంది. అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. . ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. అంటూ సాగే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి సుమతి పాత్రలో కనిపించనుంది.
లక్కీ భాస్కర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రపంచం చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ద్వారా చెబుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
శ్రీమతి గారు ప్రోమో..
లక్కీ భాస్కర్ టీజర్…