Lucky Baskhar | పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ఇదే రోజు రావాల్సి ఉండగా.. 2025కు వాయిదా పడ్డది. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర కూడా ఇదే తేదీన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ విడుదలపై కొంత డైలమా ఏర్పడింది. సినిమా విడుదలపై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌లో కొత్త అప్డేట్తో జోష్ నింపారు మేకర్స్. జూన్ 17న లక్కీ భాస్కర్ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. అంటూ సాగే డైలాగ్స్ తో సాగుతున్న టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి సుమతి పాత్రలో కనిపించనుంది.
లక్కీ భాస్కర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రపంచం చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తుండగా .. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Here’s wishing our exceptionally talented composer @gvprakash a very Happy Birthday! 🎹 – Team #LuckyBaskhar 🏦#HBDGVPrakashKumar ✨
The Musical Journey of Lucky Baskhar Begins on 17th June. 🎼@dulQuer #VenkyAtluri @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli… pic.twitter.com/qLS6xjXNuW
— Sithara Entertainments (@SitharaEnts) June 13, 2024
లక్కీ భాస్కర్ టీజర్…