Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన దుల్కర్, ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కాంత’ అనే చిత్రం చేస్తుండగా, ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. సోమవారం(జులై 28) దుల్కర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ మొదటి నుంచి ఆసక్తికరంగా కొనసాగుతుంది. తెలుగు సినిమా ప్రారంభ దశల నేపథ్యంలో కథ సాగుతోంది. ‘శాంత’ అనే హారర్ మూవీని డైరెక్ట్ చేయాలని ఆశపడి దుల్కర్ రంగంలోకి దిగతాడు. ఈ సినిమా తీర్చిదిద్దే క్రమంలో అతని జీవితంలో జరుగే మలుపులే ‘కాంత’ సినిమా. టీజర్‌ను బట్టి చూస్తే, తన గురువు సముద్రఖని స్థాయిలో ఒక క్లాసిక్ హారర్ మూవీ తీయాలనే కసితో దుల్కర్ తన టాలెంట్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమవుతాడు. ఈ క్యారెక్టర్లో ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందనడానికి టీజర్ తో హింట్ ఇచ్చారు. 1950లో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో రానా, సముద్రఖనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాతో దుల్కర్ మళ్లీ ఓ సీరియస్ యాక్టర్‌గా తన టాలెంట్‌ను నిరూపించబోతున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తున్నారు. నిర్మాతలుగా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ జాను చంతార్ సంగీతం అందిస్తున్నారు. వినూత్నమైన కథతో, హర్రర్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఒక హర్రర్ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఓ ఫిల్మ్‌మేకర్‌గా దుల్కర్ పయనించే కథ ‘కాంత’. కంటెంట్ పరంగా డిఫరెంట్ గానే కాదు, ఎమోషన్, మిస్టరీ, టెక్నికల్ వాల్యూస్ పరంగా కూడా ఇది కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా అవుతుందని టీజర్ స్పష్టం చేసింది.