 
                                                            దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీబోర్సే కథానాయిక. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ను విడుదల చేశారు. 1950నాటి మద్రాస్ సినిమా స్వర్ణయుగం నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రమిదని, అప్పటి ప్రజల జీవితానికి అద్దంపడుతుందని మేకర్స్ తెలిపారు.
పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హృదయాల్ని కదిలించే అద్భుతమైన ప్రేమకథ ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఝను చంతర్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.
 
                            