Dulquer Salmaan | నేరుగా తెలుగులో నటించి హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన పరభాషా నటుడిగా కమల్‌హాసన్ అప్పుట్లో రికార్డు సృష్టించారు. మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ విజయాలతో ఆ రికార్డును ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సమం చేశారు. కమల్ని తెలుగువాళ్లు తమ హీరోగా చూస్తారు. ఇప్పుడు దుల్కర్‌ని కూడా అలాగే చూస్తున్నారు. వైవిధ్యమైన నటన వల్లే దుల్కర్‌కి ఇది సాధ్యమైంది. ‘లక్కీభాస్కర్’ విజయానందంలో ఉన్న ఆయన.. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివి.