Pradeep Ranganathan | కోలీవుడ్ యంగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన చిత్రం డ్యూడ్ (Dude). కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమితాబైజు హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో తన ఎక్జయిట్మెంట్ను షేర్ చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.
డ్యూడ్ సినిమాను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరందించిన ప్రేమ మరిచిపోలేనిది. డ్యూడ్ సినిమా డ్రాగన్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిందని నిర్మాతలు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.
నన్ను అంగీకరించిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలకు చాలా అద్భుతమైన స్పందన ఇచ్చారు. ఇప్పుడు డ్యూడ్ సినిమాకు అంతకు మించిన అభిమానం, ఆదరణ చూపించారు. తమిళనాడులో కూడా నా గత సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు డ్యూడ్ సినిమాకు వస్తున్నాయన్నాడు ప్రదీప్ రంగనాథన్.
డ్యూడ్ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నాడు థియేటర్లలో ప్రేక్షకుల ఆనందం చూస్తుంటే చాలా జాయ్ఫుల్గా
ఉందన్నాడు ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి..