నట్టి కరుణ కథానాయికగా నటించిన చిత్రం ‘డీఎస్జే(దయ్యంతో సహజీవనం’. నట్టికుమార్ దర్శకుడు. నట్టి క్రాంతి నిర్మించారు. ట్రైలర్ను ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా నట్టికరుణ మాట్లాడుతూ ‘హారర్, సస్పెన్స్ అంశాలతో సాగే మహిళా ప్రధాన చిత్రమిది. రెండు విభిన్న కోణాల్లో నా పాత్ర సాగుతుంది’ అని తెలిపింది. ‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం. తనకు జరిగిన అన్యాయంపై ఓ ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నట్టికుమార్ తెలిపారు.