Singer Mangli | సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం.!
Mangli's birthday party | ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాలకు దారి తీశాయి.
Mangli’s birthday party | ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాలకు దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా.. ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు.
అయితే ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని సాంపుల్స్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి.. పలువురికి గంజాయి పాజిటివ్
పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్
చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీపై పోలీసుల దాడులు, విదేశీ మద్యం సీజ్
పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన… https://t.co/nOQ1MJGNgc pic.twitter.com/rCPHVjFb7f
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
Read More
-
Jr Ntr | ‘వార్ 2’కి డబ్బింగ్ షురూ చేసిన ఎన్టీఆర్
-
KTR | రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Sonam Raghuvanshi | రాజా రఘువంశీతో ఇష్టంలేని పెళ్లి.. తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

