Drishyam 3 | బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ సునామీ.. కేవలం 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో మోహన్‌లాల్!
Drishyam 3 | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సెన్సేషనల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Drishyam 3 | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సెన్సేషనల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మూడో రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా ఏకంగా రూ. 117.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన రెండవ సినిమాగా సరికొత్త చరిత్ర లిఖించింది.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు రూ. 40.60 కోట్ల నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే శని, ఆదివారాల్లో కలెక్షన్లు భారీగా పుంజుకున్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్లోనే ఏకంగా రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎప్పటిలాగే మలయాళ వెర్షన్ రూ. 11.65 కోట్ల నెట్ కలెక్షన్లతో టాప్‌లో నిలవగా, తెలుగు, తమిళ, కన్నడ వెర్షన్లు కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న క్రేజ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తుండటంతో కేరళలో దాదాపు 67% పైగా అక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
ఈ ఘన విజయంపై మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, గడిచిన 13 ఏళ్లుగా జార్జ్‌కుట్టి కుటుంబంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి చేతులెత్తి మొక్కుతున్నానని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ సినిమాలో మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

