Drishyam-2 hindi remake | సినీరంగంలో ఒక సినిమా మంచి విజయం సాధించిందంటే ఇతర భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం. ఇందులో దృశ్యం కూడా ఒకటి. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఏకంగా 7 భాషల్లో రీమేక్ అయింది. ఇందులో విశేషం ఏంటంటే ఈ ఏడు భాషల్లో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు.తెలుగు రీమేక్‌ను శ్రీప్రియ దర్శకత్వం వహించింది. ఇక గతేడాది దృశ్యం సీక్వెల్ కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సీక్వెల్‌ను వెంకటేశ్‌తో స్వయంగా జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ఈ సీక్వెల్ ఇక్కడ కూడా విజయం సాధించింది. తాజాగా ఈ చిత్ర సీక్వెల్ దృశ్యం2 హిందీలో ప్రారంభమైంది.
అజయ్ దేవగన్, శ్రియా శరణ్ దృశ్యం హిందీ రీమేక్‌లో నటించారు. ఇక తాజాగా దృశ్యం సీక్వెల్‌ను గురువారం మేకర్స్ ప్రారంభించారు. ఈ సీక్వెల్‌కు అభిషేక్ పతక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రియా శరణ్, టబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాదీ ప్రథమార్థంలోపు సినిమాను పూర్తీ చేసి ఇదే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయాలని చిత్రం బృందం ప్లాన్ చేస్తుందట.
Can Vijay protect his family again? #Drishyam2 shoot begins.#Tabu @shriya1109 @AbhishekPathakk @KumarMangat pic.twitter.com/FwX5v1fpil
— Ajay Devgn (@ajaydevgn) February 17, 2022