వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు.
‘ఆకాశమంత చిలిపితనం.. అంతరిక్షమంత పసితనం.. మేఘమాల లాంటి పడుచుతనం.. మధ్యలోనే ఉరిమే గడుసుతనం.. నేలమీది నక్షత్రమా..’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, శ్రీవసంత్ స్వరపరిచారు. అనుదీప్ దేవ్ పాడారు. హీరోయిన్‌పై హీరోకు ఉన్న ప్రేమను ఆవిష్కరించేలా చంద్రబోస్ ఈ పాట రాశారని, సినిమాకు ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి.