ప్రశాంత్కృష్ణ, అనీషాధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డ్రీమ్ క్యాచర్’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సందీప్ కాకుల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.
ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, ైక్లెమాక్స్ ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయని దర్శకుడు తెలిపారు. కలల నేపథ్యంలో నడిచే సరికొత్త కాన్సెప్ట్ ఇదని హీరో ప్రశాంత్కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రణీత్ గౌతమ్ నంద, సంగీతం: రోహన్ శెట్టి, నిర్మాత, దర్శకత్వం: సందీప్ కాకుల.