రిచర్డ్ రిషి హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ద్రౌపది 2’. రక్షణ ఇందుచూడన్ కథానాయిక. మోహన్ జి. దర్శకుడు. సోల చక్రవర్తి నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా బుధవారం ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహమ్మద్ బీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తున్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలిపారు.
దర్శకుడు మోహన్.జి రాసిన ఈ పాటను జిబ్రాన్ స్వరపరిచి, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్లతో కలిసి ఆలపించారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలిపారు. నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఫిలిప్ ఆర్.సుందర్, నిర్మాణం: నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్.