దేశంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రాల్లో ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కలయికలో రూపొందుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాపై వినిపిస్తున్న విశేషాలు ఆడియన్స్‌లో అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎగురుతున్న ఫ్లైట్‌లో ఈ యాక్షన్స్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారట దర్శకుడు ప్రశాంత్‌నీల్. హాలీవుడ్ రేంజ్లో గ్రాండ్ విజువల్స్‌తో ఈ ఎపిసోడ్ ఉండబోతున్నదని, గ్రీన్మ్యాట్లో కాకుండా, రియల్‌గా ఎగురుతున్న విమానంలోనే ఈ ఎపిసోడ్‌ని షూట్ చేయనున్నారని ఇన్సైడ్ టాక్.
కేవలం ఎలివేషన్ కోసమే కాకుండా, కథలో కీలకమైన మలుపుగా ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఎపిసోడ్ ఎండింగ్లో బలమైన ట్విస్ట్ కూడా ఉంటుందట. ఇప్పటివరకూ ప్రశాంత్‌నీల్ సినిమాలు బ్లాక్ అండ్ గ్రే టింట్‌తో గంభీరమైన మోడ్‌లో సాగాయి. ఈ సినిమా మాత్రం దానికి భిన్నంగా కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఉంటుందట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం కోసమే ఈ మార్పు అని చిత్రబృందం చెబుతున్నది. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రంలో రుక్మిణీవసంత్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.