టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప (Pushpa) సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి (Sneha Reddy) తండ్రి డాక్టర్ కే చంద్రశేఖర్ రెడ్డి (Dr K Chandra Shekar Reddy) తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. పుష్ప సక్సెస్ పార్టీని శనివారం రాత్రి పార్క్‌హయత్ హోటల్ (Park Hyatt Hotel)లో ఏర్పాటు చేశారు.
పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతోపాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్, సుబ్బిరామి రెడ్డి, భాను ప్రకాశ్ ఐఏఎస్,అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్పలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.