బుధవారం హీరో రామ్ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ నేపథ్య సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. హీరో రామ్ ఓల్డ్ సిటీ శంకర్‌గా మాస్ పాత్రలో మెప్పించారు. హైదరాబాదీ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు పూరి జగన్నాథ్.. రామ్ పాత్రని పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ైస్టెలిష్‌గా ఆవిష్కరించారు. బిగ్బుల్ పేరుతో ప్రతినాయకుడు సంజయ్‌దత్ పాత్రను పరిచయం చేశారు. చివరగా శివుడికి సంబంధించిన ఓ ఆధ్యాత్మిక అంశంతో టీజర్‌ను ముగించిన తీరు మెప్పించింది. మొదటి భాగం కంటే డబుల్ యాక్షన్, డబుల్ ఫన్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, రామ్ పాత్ర మరింత మాస్ అంశాలతో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి కె నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.