Sankranthiki Vasthunam | వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) . మీనాక్షి చౌదరి, ఐశ్వర రాజేష్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.250 కోట్ల గ్రాస్‌ను, సుమారుగా రూ.130 కోట్ల షేర్‌ను వసూలు చేసింది.
ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రంలో ఉన్న కామెడీపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. అయితే ఇప్పటికీ థియేటర్స్‌ల్లో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి ప్రథమార్థంలో ఓటీటీలో రాబోతుందన్న న్యూస్ మేకర్స్‌ను కంగారు పెట్టంది.
ఈ చిత్రం ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సినిమాకు వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మార్చమని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేస్తే ఓటీటీ సంస్థకు దర్శకుడు అనిల్ రావిపూడి ఓ బంపర్ ఆఫర్‌ను ఇచ్చాడు.
మార్చిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకుంటే.. మొదట్లో నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌కు అదనంగా చిత్రానికి మరో 10 నిమిషాల ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను యాడ్ చేస్తామని చెప్పారని సమాచారం. దీనిపై ఓటీటీ సంస్థ నిర్ణయం మాత్రం పెండింగ్‌లో ఉంది. సినిమాలో హిలేరియస్ కామెడీని పండించిన బాలనటుడు బులిరాజు సన్నివేశాలు కూడా ఈ అదనపు పది నిమిషాల నిడివిలో అంటున్నారు.. ఇంకేముంది.. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ వెర్షన్ మరింత వినోదం అందించడానికి రెడీ అవుతుంది.
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్