సువిక్షిత్, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్‌రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘అపన్నా తనామనా’ అనే లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హీరో సువిక్షిత్ గొప్ప పాషన్‌తో నటించారని మెచ్చుకున్నారు. 1990 నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇదని, ప్రతి ఒక్కరిని ఆ కాలంలోకి తీసుకెళ్తుందని, బ్యాక్‌డ్రాప్‌కు తగిన లొకేషన్లలో సహజంగా తెరకెక్కించామని, తన అభిమాన దర్శకుడు సుకుమార్ ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని హీరో సువిక్షిత్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ గుర్రాన, దర్శకుడు: కార్తికేయ కొమ్మి.