తమిళ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన తమిళ చిత్రం డాక్టర్ (Doctor). తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 9న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ మూవీ రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ పండితుల అంచనా. కోవిడ్ ప్రభావంతో సెకండ్ లాక్డౌన్ తర్వాత థియేటర్ల పరిస్థితిపై డైలామా కొనసాగుతున్న ఇలాంటి సమయంలో డాక్టర్‌కు రూ.60 కోట్లు కలెక్షన్లు రావడం విశేషమనే చెప్పాలి.
డాక్టర్ సినిమా మంచి కాసులు కురిపిస్తుండటంతో తమిళ ఎగ్జిబిటర్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. శివకార్తికేయన్‌కు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Mohan) నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.
శివకార్తికేయన్ ప్రస్తుతం అయలాన్, డాన్, సింగపతై చిత్రాల్లో నటిస్తున్నాడు. సుమారు 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాక్టర్ బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తుందడంతో శివకార్తికేయన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్