Oye | సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ఓయ్!. 15 ఏండ్ల కిందట రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. పాటలు, స్టోరీ బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన షామిలీ బొద్దుగా ఉండటం.. క్లైమాక్స్‌లో హీరోయిన్ చనిపోవడం వంటి కారణాల వల్ల ఓయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది. కానీ టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం ఆడియన్స్ ఈ సినిమాను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం నాడు ఓయ్ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగ తాజాగా వివరించారు. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లు.. హీరోలను ఓయ్ అని పిలుస్తుంటారు. అంతేకాదు.. మన తెలుగువారు కూడా ఈ పదాన్ని కామన్‌గా వాడుతుంటారు. అందుకే తను ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ సంధ్య.. హీరో క్యారెక్టర్ ఉదయ్‌ను పేరుతో కాకుండా ఓయ్ అని పిలిచేలా డైరెక్టర్ ఆనంద్ రంగ కథ రాసుకున్నాడు. సినిమా మొత్తంలో చాలాసార్లు ఈ పదం మనకు వినిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఓయ్ అనే టైటిల్ పెట్టారని చాలామంది అనుకున్నారు. కానీ దాని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. నిజానికి ఓయ్ సినిమా కథ రాసుకునేటప్పుడు పరుగు అనే టైటిల్ అనుకున్నాడట డైరెక్టర్ ఆనంద్ రంగ. కానీ ఆ టైటిల్‌తో అప్పటికే అల్లు అర్జున్ సినిమా వచ్చేసింది. దీంతో వేరే టైటిల్ పెట్టాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా కథ మొత్తం ఏడాదిలోపు జరుగుతుంది. 2007 జనవరి 1వ తేదీన మొదలై.. 2008 జనవరి 1వ తేదీతో ముగుస్తుంది. అంటే ఏడాదిపాటు సాగే ప్రేమ కథ కావడంతో దాన్ని రిప్రజెంట్ చేసేలా టైటిల్ పెట్టాలని అనుకున్నారు. దీంతో One Year ను షార్ట్ చేసి OY!గా ఫిక్స్ చేశారు.