Bigg Boss season 5 telugu | సైలెంట్ కిల్లర్ ఆఫ్ ‘బిగ్ బాస్’ హౌజ్ ఎవరో తెలుసా..?
బిగ్ బాస్ (Bigg Boss House) ఇంట్లోకి వెళ్లి 19 మంది విభిన్నమైన మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు..ఒక దగ్గర ఒక ఇంట్లో కలిసి ఉండడం అనేది ఎంత మాత్రం చిన్న విషయం కాదు.

బిగ్ బాస్ (Bigg Boss House) ఇంట్లోకి వెళ్లి అక్కడ అందరికీ నచ్చినట్టు ఉండడం అంటే అంత చిన్న విషయం కాదు. 19 మంది విభిన్నమైన మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు..ఒక దగ్గర ఒక ఇంట్లో కలిసి ఉండడం అనేది ఎంత మాత్రం చిన్న విషయం కాదు. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చదు.. కొందరు కొందరితోనే కలిసి తిరుగుతారు..మరికొందరు ఒంటరిగా ఉండిపోతారు..ఎవరితోనూ పెద్దగా కలవరు.. ఇలా బిగ్ బాస్ (Biggboss Show) షో మొదలైన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన క్యారెక్టర్స్ మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి.
సీజన్ 5 మొదలైన తర్వాత కూడా ఇదే జరుగుతుంది. ఈ సారి కూడా 19 మంది భిన్నమైన ఆలోచనా విధానం కలిగిన కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో ఇప్పటికే ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన 17 మంది టైటిల్ కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే షో మొదలై రెండు వారాలు పూర్తి అయిపోయింది. ఈ 15 రోజుల్లో ఎవరు ఏంటి అనేది ప్రేక్షకులకు కూడా ఒక ఐడియా వచ్చింది. అయితే అందరిలో ఒక్కడు మాత్రం చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు.

అతడి క్యారెక్టర్ కూడా సస్పెన్స్ గా ఉంది. తన ఆటను చాలా చక్కగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు.. ఇకపై వస్తాడు అనే ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. ఎందుకంటే అందరితోనూ బాగున్నాడు.. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కంటెంట్ ఇస్తున్నాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss season 5) లో సూపర్ సైలెంట్ కిల్లర్ అతడు.. ఆయన ఎవరో ఈపాటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది..ఆ కుర్రాడే షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth).
సోషల్ మీడియాలో మనోడికి ఏ రేంజిలో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గానీ నామినేషన్స్ లోకి వచ్చాడు అంటే రికార్డు మెజారిటీతో సేవ్ అయ్యే సత్తా ఈయన సొంతం. అయితే నామినేషన్స్ తన వైపు రాకుండా చాలా జాగ్రత్తగా ఆడుకుంటున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఈయనతో పాటు ఉన్న సిరి నామినేషన్స్ లోకి వచ్చింది. కానీ షన్ను మాత్రం చాలా తెలివిగా ఆడుతున్నాడు. ఏ మాత్రం తక్కువ అంచనా వేశారో ఏకంగా టైటిల్ కూడా గెలిచే సత్తా ఈ కుర్రాడి సొంతం. మరి రాబోయే రోజుల్లో ఈ సైలెంట్ కిల్లర్ ఇంకా ఏమేం చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

