Nivetha Pethuraj | కొందరు హీరోయిన్లకు చాలా తొందరగా గుర్తింపు వస్తుంటుంది. అలాంటి హీరోయిన్లలో నివేదా పేతురాజ్ కూడా ఒకరు. మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత తమిళంలో టిక్ టిక్ టిక్, రోషగాడు వంటి సినిమాలు చేసింది నివేదా. తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల వైకుంఠపురములో, రెడ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది నివేదా. ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడుతున్నాయి. హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నివేదా.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా !
సినిమాల్లోకి రాకముందు నివేదా పేతురాజ్ ఏం చేసేది అనేది చాలా మందికి ఐడియా లేదు. హీరోయిన్ కాకముందు ఈమె ఓ బొటిక్ నిర్వహించేది. కేవలం బొటిక్ మాత్రమే కాకుండా.. డబ్బుల కోసం చాలా కష్టపడేది నివేదా. పలు ఈవెంట్లు చేసేది.. కార్ల కంపెనీల్లో కూడా పని చేసింది నివేదా పేతురాజ్. అందంతో పాటు హీరోయిన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా సినిమాల్లో ట్రై చేయమని ఆ సమయంలో కొందరు ఫ్రెండ్స్ సలహా ఇవ్వడంతో ఇటువైపు వచ్చానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నివేదా పేతురాజ్. వచ్చీ రాగానే మంచి సినిమాలు పడటంతో నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో తన పాత్రకు స్కోప్ ఉంటేనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెబుతానంటుంది నివేదా. తాను ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే యోగా ఇన్ స్ట్రక్టర్ అయ్యేదాన్నని తెలిపింది. రానా, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న విరాట పర్వం సినిమాలో కీలక పాత్రలో నటించింది నివేదా పేతురాజ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
OTT ఎఫెక్ట్ : ఓవర్సీస్లో టాలీవుడ్‌కు ఊహించని దెబ్బ !
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలనుందట..!