తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేశ్ బాబు (MaheshBabu) . సోషల్ మీడియాలో మహేశ్ బాబుకు క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్ మెంట్స్ షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఈ సూపర్ స్టార్.
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ (Twitter Family )లో కనిపిస్తూ.. తన అప్ డేట్స్ ఇస్తుంటాడు. మహేశ్ బాబు పెట్టే పోస్టులకు లైక్స్, షేర్స్, కామెంట్లు వర్షంలా కురుస్తుంటాయి. హాలీవుడ్ స్టార్ హీరో అయ్యే క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న మహేశ్ బాబు అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మహేశ్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు చేరువలో ఉంది. తాజా అప్డేట్తో సౌతిండియాలో ఎక్కువమంది ఫాలో అవుతున్న యాక్టర్‌గా నిలిచాడు మహేశ్ బాబు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 28 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తవగానే జక్కన్న ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు మహేశ్ బాబు.
Superstar @urstrulyMahesh Is The Most Followed ACTOR in SOUTH INDIA with 13 Million Family on Twitter 🔥 #MaheshBabu #SSMB28 #SSMB pic.twitter.com/vIt62rxl5T
— BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో