గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 05, 2020 , 16:34:09

మ‌హేశ్ చిత్రంలో కీర్తిసురేశ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

మ‌హేశ్ చిత్రంలో కీర్తిసురేశ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

టాలీవుడ్ యాక్ట‌ర్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట‌. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. క‌థానుగుణంగా ఈ సినిమాను ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయ‌నున్నారు. అయితే ఈ చిత్రంలో కీర్తిసురేశ్ రోల్ గురించి ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల వార్త‌లు ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా దీనికి సంబంధించి మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది.

ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఎవ‌రినీ లెక్క‌చేయని అహంబావిగా, త‌న‌కు న‌చ్చిన ప‌నిని చేసే వ్య‌క్తిగా క‌నిపించ‌నుంద‌ట‌. ఇక ఈ చిత్రం కోసం మ‌హేశ్ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హెయిర్ క్రాప్ పెంచి స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్నారు.  థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo