Ustaad Bhagat Singh | ఈ ఏడాది హరిహరవీరమల్లు పార్టు 1, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టగా.. వీటిలో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మూవీ లవర్స్, అభిమానుల కోసం అదిరిపోయే న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తియిందని ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం ఇంకా మూడు వారాలు షూట్ పెండింగ్‌లో ఉందట. ఒక్కసారి ఈ షెడ్యూల్ పూర్తయితే నవంబర్ చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే.
ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాశీఖన్నాకీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.