తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు అన్నో.. సినిమాలకు గుడ్ బై వార్తలపై మంచు మనోజ్ క్లారిటీ
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్‌లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చే సరికి.. ఆయనే మీడియా ముందుకు రాక తప్పలేదు.
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్‌లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చే సరికి.. ఆయనే మీడియా ముందుకు రాక తప్పలేదు.

గతంలో కూడా మనోజ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా పరాజయం తర్వాత తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇలాంటి విషయాల్లో తొందరపాటు మంచిది కాదని తండ్రి మోహన్ బాబు క్లాస్ తీసుకోవడంతో నిర్ణయం మార్చుకున్నాడు. ఆ తర్వాత కొత్త దర్శకుడు శ్రీకాంత్‌తో అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్డేట్స్ రాలేవు. దీంతో ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. దానికి తోడు మంచు మనోజ్ కొత్త బిజినెస్ కూడా మొదలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన మంచు వారబ్బాయి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేనని తేల్చేశాడు. ఈ మేరకు ట్విటర్లో ఒక పోస్టు పెట్టాడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి బిజినెస్ చేయబోయే మాట వాస్తవమే కానీ.. దానికోసం సినిమాలకు దూరం అవుతున్నాను అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు మంచు మనోజ్. వచ్చే సమ్మర్ నుంచి తన కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు మనోజ్. ఈ మధ్యే తిరుమల శ్రీవారి దర్శనానికి అక్క మంచు లక్ష్మితో కలిసి వెళ్లిన మనోజ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నట్లు.. వాటితో యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

