దర్శకుడు వి.సముద్ర తనయులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా పరిచయం అవుతున్న సినిమా ‘దో కమీనే’. తస్మయి, శ్రీరాధ హీరోయిన్లు. వి.సముద్ర దర్శకుడు. చంద్ర పులుగుజ్జు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సుమన్ క్లాప్ ఇవ్వగా, నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచాన్ చేశారు. బి.గోపాల్ ఫస్ట్‌షాట్‌కి దర్శకత్వం వహించారు. హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. అతిథులంతా యూనిట్‌కి శుభాకాంక్షలందించారు. నవంబర్ 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని సముద్ర తెలిపారు. ఇంకా యూనిట్ మొత్తం మాట్లాడారు. సుమన్, బ్రహ్మానందం, అలీ, సునీల్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: వినోద్, డైలాగ్స్: ఘటికాచలం.