‘మనసంతానువ్వే’ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఓఎంజీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో గల లాకింట బంకేట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లోనే జరుగనున్నదని, త్వరలోనే సెట్స్‌కు వెళ్లనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ని నిర్వహించారు. ప్రవాస భారతీయులతోపాటు అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్, మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ వారు కూడా భారీ సంఖ్యలో ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఈ పరిణామంపై దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆనందం వ్యక్తం చేశారు.