నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా రూపొందిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఉమాదేవి, దర్శకుడు విపిన్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది అచ్చమైన తెలుగు సినిమా. మా దర్శకుడు విపిన్ భాషాభిమాని.
అందుకే ఈ సినిమా ఆద్యంతం తెలుగుదనంతో నిండి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? అనేది ఈ కథలో చాలా ఆసక్తికరమైన అంశం’ అని నిర్మాత ఉమాదేవి తెలిపారు. ‘ఇందులో హీరోది మ్యూజికల్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకునే పాత్ర. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించారు. ఈ పాత్ర కోసం మ్యూజిక్ టీచర్ని పెట్టుకొని బేసిక్స్ నేర్చుకున్నారాయన. ఊటీలో ఇప్పటివరకూ ఎవరూ షూట్ చేయని లొకేషన్లలో చిత్రీకరణ జరి పాం. అని దర్శక, నిర్మాతలు చెప్పారు.