‘ నాకు హిమాలయాలు, మంచు, అక్కడ ప్రయాణం చాలా ఇష్టం. విఠలాచార్య లాంటి సాహసకథలంటే ఇష్టం. ఇవన్నీ కలిసి ఓ ఆలోచనగా మారాయి. ఈ ఆలోచనలకు నిజంగా జరిగిన ఓ సంఘటనను మిళితం చేసి తయారు చేసుకున్న కథే ‘గామి’ అన్నారు దర్శకుడు విద్యాధర్ కాగిత. విశ్వక్సేన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఈ చిత్రానికి కార్తీక్ శబరీశ్ నిర్మాత. చాందినీ చౌదరి కథానాయిక. ఈ నెల 8న మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విద్యాధర్ విలేకరులతో మాట్లాడారు. ‘చిన్నగా మొదలై ఓ భారీ ప్రాజెక్ట్‌గా రూపాంతరం చెందింది ‘గామి’.
విశ్వక్సేన్కి ఏ ఇమేజ్ లేనప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. ఈ కథతో 5ఏళ్లు ప్రయాణం చేశాం. నేచర్ నుంచి కావాలనుకున్న దానికోసం ఏడాది పాటు ఆగి అనుకున్నది తీసుకున్నాం. ‘అవతార్’ పదేళ్లు తీశారు. దాన్ని ఆలస్యం అనకూడదు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాం. ‘గామి’ ఓ విజువల్ వండర్’ అని చెప్పారు దర్శకుడు. గామి అంటే గమ్యాన్ని చేరేవాడు అని అర్థమని, హీరో గమ్యాన్ని ఎలా చేరాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని, తర్వాత ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీ కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధానబలమని దర్శకుడు అన్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ ప్రాజెక్టులోకి ఎంటరవ్వగానే ఫైనాన్షియల్‌గా మాకు ఫ్రీడమ్ వచ్చిందని, వనరులు పెరగడంతో క్వాలిటీకి ఎక్కడా తగ్గలేదని, సాంకేతికంగా వండర్ అనిపించే సినిమా ఇదని దర్శకుడు విద్యాధర్ పేర్కొన్నారు.