New Guy in Town | తెలుగు సినీ పరిశ్రమ టాలెంట్ ఉన్న నటీనటులకు గ్రాండ్ లాంచ్ ప్యాడ్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #Newguyintown హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ అవుతున్న సినిమాతో కొత్త వ్యక్తి హీరోగా డెబ్యూ ఇస్తుండగా.. ఇంతకీ అతడెవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్. ఇంతకీ ఆ కొత్త యాక్టర్ ఎవరనేది సస్పెన్స్‌లో ఉండగా.. ఇప్పుడీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడడైన డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారాడు.
వెంకీ కుడుముల కొత్తగా లాంచ్ చేసిన What Next Entertainments బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది. పాపులర్ మలయాళ భామ అనస్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గానటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి రాజ మహదేవన్ సినిమాట్రోఫర్. న్యూ ఏజ్ ప్రాజెక్ట్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్త నటీనటులతోపాటు పాపులర్ యాక్టర్లు నటించనున్నారని సమాచారం.
లవ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ రాబోయే ఈ సినిమాలో హీరోగా నటిస్తుందెరనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రేపు లాంచ్ చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. మనల్ని నవ్వించి, మురిపించి, ప్రేమలో పడేలా చేసిన స్టోరీ టెల్లర్.. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాడు.. అంటూ షేర్ చేసిన ఈ వార్త నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది.
A storyteller who made us smile, laugh, and fall in love…
is now stepping into a new chapter.🎬Presenting @VenkyKudumula – The New Producer in Town. ✨@WhatNextEnts’ Production No.1 Title Glimpse drops on Dec 14th!💥
ICYM Announcement Video:
🔗 https://t.co/czKeDNPoFP… pic.twitter.com/oAzYOIkP5j— BA Raju’s Team (@baraju_SuperHit) December 13, 2025
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో