Raviteja | ‘ధమాకా’తో వందకోట్ల విజయాన్ని అందుకున్నారు హీరో రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఆ సినిమా తర్వాత వెంటనే నక్కినతో మరో సినిమా చేయాలని రవితేజ భావించారట. కానీ అప్పటికే కమిట్మెంట్స్ ఉండటం, నక్కిన కూడా వేరే సినిమాకు ఓకే చెప్పడం.. ఈ కారణాల వల్ల ‘ధమాకా’కు వెంటనే వీరి కాంబినేషన్ కుదర్లేదు. ప్రస్తుతం సందీప్‌కిషన్‌తో ‘మజాకా’ సినిమా చేస్తున్నారు నక్కిన త్రినాథరావు. ఈ సినిమా పూర్తవ్వగానే ఆయన రవితేజ సినిమాని పట్టాలెక్కిస్తారట.
ఓ వైపు ‘మజాకా’ షూటింగ్ చేస్తూనే మరోవైపు తన రైటింగ్ టీమ్‌తో రవితేజ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి చేసేస్తున్నారట నక్కిన. నిజానికి ‘ధమాకా’ నిర్మాణంలో ఉన్నప్పుడే రవితేజకు ఓ కథ చెప్పి ఆయన ఓకే చేయించుకున్నారట. ప్రస్తుతం రవితేజ సితార ఎంటైర్టెన్మెంట్స్కి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు సినిమా ఉంటుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఈ సారి అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం.