జై భీమ్ దర్శకుడితో కొత్త సినిమా
‘జై భీమ్' చిత్రం చక్కటి సామాజిక సందేశంతో అగ్ర హీరో సూర్య కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది.
‘జై భీమ్’ చిత్రం చక్కటి సామాజిక సందేశంతో అగ్ర హీరో సూర్య కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ సినిమా సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ‘సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమాకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించే అర్థవంతమైన కథ ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. సాయి అభ్యంకర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

