కొత్తవాళ్లను పరిచయం చేయడంలో దిట్ట దర్శకుడు తేజ. చిత్రం, నువ్వూ-నేను, జయం చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆయన ద్వారా పరిచయమైన ఎందరో నటీనటులు స్టార్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. త్వరలో తన కుమారుడు అంకితోవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేయనున్నారట తేజ. ప్రస్తుతం అంకితోవ్ యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ఘట్టమనేని రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం చేయనున్నారట తేజ. ఓ అందమైన ప్రేమకథతో ఈ సినిమా రూపొందనున్నదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.