ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు అగ్ర హీరో పవన్‌కల్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వారు కోరుకున్న శుభవార్త వెలువడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ తన కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జైత్రరామ్ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.
తమ బ్యానర్ పేరును పవన్‌కల్యాణే పెట్టారని ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.