‘నేను ఎన్నో థ్రిల్లర్ సినిమాలకు పనిచేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పనిచేయడం మాత్రం కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టగలగాలి. దానికి సౌండ్ కొత్తగా, వైరైటీగా ఉండాలి. దానికోసం ఎంతో కష్టపడాల్సొచ్చింది.’ అని దర్శకుడు శ్రీచరణ్ పాకాల చెప్పారు.
ఆది సాయికుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
మైథలాజికల్ కథలంటే తనకిష్టమని, ఆ జానర్ సినిమాకు సంగీతాన్నందించడం ఆనందంగా ఉందని, ఈ సినిమాకోసం రకరకాల వాయిద్యాలను వాడానని, ఇందులోని పాటలుకూడా బావుంటాయని, నిర్మాతలు ఎంతో సహకరించారని, ఓ కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేలా, మెస్మరైజ్ చేసేలా ‘శంబాల’ ఉంటుందని శ్రీచరణ్ పాకాల తెలిపారు.