Director Shankar | ‘క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్ ఉల్లంఘించకండి.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవ్’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ దర్శకుడు శంకర్. వివరాల్లోకెళితే.. తమిళ రచయిత వెంకటేశన్ రాసిన ‘నవయుగ నాయగన్ వేళ్ పారి’ నవల కాపీరైట్స్‌ని గతంలోనే శంకర్ దక్కించుకున్నారు. ఆ నవలలోని సన్నివేశాలను ఓ సినిమాలో వినియోగించడం చూసి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఓ కొత్త సినిమా ట్రైలర్ చూశా. అందులో ‘నవయుగ నాయగన్ వేల్ పారీ’ నవలలోని ముఖ్యమైన సన్నివేశాన్ని వాడేశారు. చూసి షాక్ అయ్యా. ఆ నవలపై కాపీరైట్స్ నావి. నా అనుమతి లేకుండా ఆ నవలను ఎలా వాడతారు? హక్కుదారుని అనుమతి లేకుండా సినిమాలకుగానీ, వెబ్ సిరీస్‌లకు గానీ, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో కానీ నవలలోని సన్నివేశాలను ఉపయోగించడం నేరం. ఇలాంటి పిచ్చిపనులు మానండి.’ అంటూ హెచ్చరించారు శంకర్. అయితే.. ఏ సినిమా ట్రైలర్లో నవల ఆధారిత సన్నివేశం ఉందో ఆయన వెల్లడించలేదు.