అగ్ర కథానాయిక దీపికా పడుకోన్, దర్శకుడు సందీప్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్ మరింత ముదిరిపోయింది. ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా తీయబోతున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి కథానాయికగా దీపికా పడుకోన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్గా ఖరారు చేశారు. ‘స్పిరిట్’లో తొలుత దీపికా పడుకోన్‌ను నాయికగా అనుకున్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి ఆమెకు సినిమా కథ మొత్తం చెప్పారట. అయితే షూటింగ్ టైమింగ్స్, రెమ్యునరేషన్ విషయాల్లో దీపికా చేసిన డిమాండ్స్ సందీప్‌రెడ్డికి కోపం తెప్పించాయట. తాను కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తానని, 30కోట్ల పారితోషికంతో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలని, తనతో పాటు 20 మంది సిబ్బంది జీతభత్యాలను నిర్మాతలే చెల్లించాలని, వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని దీపికా పడుకోన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించారని టాక్. ఈ నేపథ్యంలో సందీప్‌రెడ్డి చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. పరోక్షంగా దీపికాను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారంటున్నారు. ‘అధికారికంగా ఒప్పందం చేసుకోకపోయినా..కథ ఎవరికీ చెప్పొద్దనే నియమాన్ని పాటించాలి. నీపై నమ్మకంతో కథ మొత్తం చెప్పాను. కానీ నువ్వు కథను రివీల్ చేసి నీ నిజస్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నావు. ఒక సినిమా కోసం కొన్నేళ్లు కష్టపడాలి. అది నీకు తెలియదు. అర్థం కాదు కూడా. అయినా భయపడేది లేదు. నువ్వు కథ మొత్తం చెప్పినా నాకేమి ఫరక్ పడదు’ అంటూ సందీప్‌రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఓ బాలీవుడ్ వెబ్సైట్లో ‘స్పిరిట్’ తాలూకు కథ బయటికొచ్చింది. ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, అదొక ‘ఏ’ రేటెడ్ మూవీ అంటూ ఆ సైట్లో పేర్కొన్నారు. దీపికా వల్లే స్టోరీ రివీల్ అయిందని సందీప్ రెడ్డి భావించారని, అందుకే ఆగ్రహంగా ట్వీట్ చేశారని అంటున్నారు.