‘ఇదొక విభిన్నమై ప్రేమకథ. దర్శకుడు రామ్ గోధల ఈ కథ చెప్పినప్పుడు నాకు లవ్‌స్టోరీ ఎందుకు? అన్నాను. కానీ కన్వీన్స్ చేశాడు. తనెంత బాగా కథ చెప్పాడో.. అంతకంటే బాగా తెరకెక్కించాడు. ఇందులోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.’ అని నటుడు సుహాస్ అన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ఓ భామ అయ్యో రామా’. మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో సుహాస్ మాట్లాడారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీగా సినిమా నిర్మించారని, మణికందన్ కెమెరా కలర్ఫుల్గా ఉంటుందని, రథన్ పాటలు కూడా ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పారు. ఈ రొమాంటిక్ ఎంటైర్టెనర్ ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నిర్మాత హరీష్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కథానాయిక మాళవిక, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి కూడా మాట్లాడారు.