Puri Jagannadh | ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని సందర్శించారు. ఈ సందర్భంగా, పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి వైరల్గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభంకాగా.. ఇందులో సంయుక్త, టబు, విజయ్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Our Dashing Director #PuriJagannadh and Producer @Charmmeofficial visited the Statue of Equality, a divine marvel envisioned by Rameswara Rao Garu & blessed by Chinnajiyar Swami Garu 🙏✨
A beacon of Ramanuja Charya’s timeless message of unity, equality & compassion. ❤️ pic.twitter.com/LlFC3t6jDU
— Puri Connects (@PuriConnects) September 3, 2025