శివ కందుకూరి హీరోగా రూపొందిన వైవిధ్యకథాచిత్రం ‘చాయ్ వాలా’. ప్రమోద్ హర్ష దర్శకుడు. రాధా వి.పాపుడిప్పు నిర్మాత. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. నీలోఫర్ కేఫ్ ఫౌండర్ బాబూరావు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
తండ్రీకొడుకుల భావోద్వేగాలే ఈ సినిమాకు ప్రధాన బలమని, రాజీవ్ కనకాల తండ్రిగా అద్భుతంగా నటించారని, సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుందని శివ కందుకూరి అన్నారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. రాజీవ్ కనకాల, తేజు అశ్విన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్యకృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి వర్ల, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, సహనిర్మాత: వెంకట్ ఆర్. పాపుడిప్పు.