భరత్‌రాజ్, దివి జంటగా నటించిన చిత్రం ‘లంబసింగి’. ‘ఏ ప్యూర్ లవ్ స్టోరీ’ ఉపశీర్షిక. నవీన్‌గాంధీ దర్శకత్వం వహించారు. కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి. నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌గాంధీ మాట్లాడుతూ ‘రాజమౌళిగారి వద్ద స్టూడెంట్ నెం.1, సింహాద్రి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. రాజీవ్ మీనన్ వద్ద యాడ్స్ చేశాను. 2014లో ‘గాలిపటం’ చిత్రంతో దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు.
‘లంబసింగి’ చిత్రం గురించి చెబుతూ.. ‘ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించాం. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. పవిత్ర ప్రేమబంధానికి నిదర్శనంలా నిలిచే చిత్రమిది. ప్రతి పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. మన చుట్టూ జరిగిన కథలా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పాటలు మంచి ఆదరణ పొందాయి. లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో 50రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేశాం. హృదయాల్ని కదిలించే భావోద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అన్నారు.