విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు సమంత. తెలుగుతెరపై ఆమె పునరాగమనం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సామ్ టాలీవుడ్ రీఎంట్రీకి ముహూర్తం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. సమంతతో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలను తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి ఇటీవలే సమంతకు ఓ కథ వినిపించారట. దానికి సామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తున్నది. సమంత కెరీర్లోనే ‘ఓ బేబీ’ని మెమరబుల్ మూవీ అని చెప్పొచ్చు. మరి ఈ సారి సమంతతో నందినీరెడ్డి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.