Jai Bolo Telangana Director | శ్రీరాములయ్య(Sriramulayya), ఎన్కౌంటర్(Encounter), భద్రాచలం(Badrachalam), జయం మనదేరా, బై బోలో తెలంగాణ (Jai Bolo Telangana) వంటి సంచలన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఎన్ శంకర్ (N Shankar). ప్రస్తుతం శంకర్ మూడు హిస్టారికల్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే శంకర్ బాటలో అతడి తనయుడు కూడా మెగాఫోన్ పట్టబోతున్నాడు. తన దర్శకత్వ ప్రతిభను నిరుపించేందుకు శంకర్ కుమారుడు దినేష్ సిద్ధమయ్యాడు.
ఫిలిం ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందిన దినేష్ మహీంద్ర ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆర్ఎక్స్ క్రియేషన్స్ సంస్థ నూతన నటినటులతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పాటల రికార్డింగ్ జరుగుతుండగా.. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్ శంకర్ వెల్లడించాడు.