“కన్నప్ప’ గురించి ఎంతో రీసెర్చ్ చేశాను. కన్నప్ప కథతో ఇంత వరకు వచ్చిన సినిమాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. అప్పుడు నాకర్థమైన విషయం ఏంటంటే.. కన్నప్ప కథ మైథాలజీ కాదు. ఇది మన హిస్టరీ.’ అని దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందిన భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ముఖేష్కుమార్సింగ్ విలేకరులతో ముచ్చటించారు.
‘ సూపర్స్టార్లయిన మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్‌లతో పనిచేయడం మరిపోలేని అనుభవం. ఇక విష్ణు కన్నప్ప పాత్రకు వందశాతం న్యాయం చేశారు’ అని తెలిపారు ముఖేష్‌కుమార్ సింగ్. రెండో శతాబ్దపు వాతావరణం తెరపైకి తేవడానికి ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి ఎంతో రీసెర్చ్ చేశామని, ఎన్నో మ్యూజియంలను సందర్శించామని, వెపన్స్, కాస్ట్యూమ్స్ మీద పరిశోధనలు జరిపామని, పొల్యూషన్ లేని నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేందుకే సినిమాను న్యూజిలాండ్‌లో తీశామని ఆయన అన్నారు.
ఇందులో ప్రాధాన్యత లేని పాత్ర ఉండదని, ముఖ్యంగా ప్రభాస్పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, రీసెంట్గా శ్రీకాళహస్తి దేవాలయ అర్చకులకు ఈ సినిమాను చూపించామని, వారు మెచ్చుకోవడమే కాక, సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? అనడిగారని ముఖేష్‌కుమార్ చెప్పారు.