దర్శకుడు మెహర్మ్రేశ్లోని ఆత్మవిశ్వాసాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. జయాపజయాలను ఆయన పట్టించుకోడు. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. ఒక్కోసారి ఫలితం గొప్పగా లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోడు. అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా మెహర్మ్రేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోళాశంకర్’ చిత్రం ఆశించినంత గొప్పగా ఆడకపోయినా ఆ ఫలితం ప్రభావం తనపై పడకుండా తన నెక్ట్స్ సినిమాల కోసం కథలు తయారుచేసుకునే పనిలో బిజీ అయిపోయాడు మెహర్మ్రేశ్.
ఇందులో భాగంగానే ఇటీవలే తన కథల గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ‘పవన్కల్యాణ్కోసం ఓ కథ తయారు చేసుకున్నాను. అవకాశం చూసుకొని ఆయనకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆయనతో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను’ అని చెప్పాడు మెహర్మ్రేశ్. సక్సెస్ వెనకాల పరిగెత్తే ఫిలిం ఇండస్ట్రీలో ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకొని ముందుకెళ్తున్న మెహర్మ్రేశ్ని నిజంగా అభినందించాలి.