ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు హీరో సాయిదుర్గతేజ్. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశారాయన. దర్శకుడు మారుతి నిర్మించనున్న ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. రాజ్‌తరుణ్ హీరోగా ఈతని దర్శకత్వంలో వచ్చిన ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ఫర్వాలేదనిపించింది.
రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాక్కూడా ఈ వంశీనే దర్శకుడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు ఇతని చేతికే ఈ ప్రాజెక్ట్‌ని అప్పగించారు మారుతి. ఈ చిత్రానికి మారుతి సూపర్వైజర్గా వ్యవహరిస్తారట. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారట. అలాగే.. కథ, కథనం, మాటలు కూడా ఆయనవే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.