డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్‌శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రధారులుగా, మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథాచిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి(గోదావరి కిట్టయ్య) నిర్మాతలు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘పట్టుకో బాబా’ అంటూ సాగే పాటను లాంచ్ చేశారు. అగ్ర దర్శకుడు కొరటాల శివ ఈ పాటను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తున్నదని, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు మహేశ్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఆకుల సురేశ్ పటేల్, మాటలు: శ్రీరామ్ ఏదోటి, సంగీతం: జీసీ క్రిష్.